అలాంటి సెంటిమెంట్ తనకి అదృష్టమంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..రోజు రోజుకి ఈమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. సౌత్ టు నార్త్ వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించింది. ఈ ఏడాది మొదటిలోనే విజయ్ దళపతి తో వరిసు అనే సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో నటిగా మరొకసారి ప్రశంసలు అందుకున్నది రష్మిక.

Ranbir Kapoor's Animal Is Something Rashmika Mandanna Has Never Imagined  Doing Before, Says "I'm Eagerly Waiting"

ప్రస్తుతం రష్మిక చేతిలో యానిమల్ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహిస్తుండగా హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కావడం విశేషం.. అయితే ఈ నెల తనకు అదృష్టం అని తెలియజేస్తోంది. రష్మిక నటించిన మొదటి సినిమా కిరీక్ పార్టీ చిత్రంతో ఈమె కెరియర్ ప్రారంభించింది ఈ సినిమా 2016 డిసెంబర్లో కన్నడలో విడుదల అయిందట. ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.

అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప సినిమా కూడా డిసెంబర్లో 2021 లో విడుదలై పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించేలా చేసింది. ఇలా తన కెరియర్లో డిసెంబర్ నెల తనకు బాగా అదృష్టం కలిసి వచ్చిందని తెలియజేస్తోంది. ఇప్పుడు అభిమానులు కూడా యానిమల్ సినిమా కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ డిసెంబర్ తనకు ఎప్పుడు అదృష్టాలనే తెచ్చి పెట్టింది..నా కెరియర్లో గిరి పార్టీ చమక్ అంజనీపుత్ర పుష్ప తదితర చిత్రాలు ఈ నెలలోని విడుదలై బ్లాక్ మాస్టర్లు అందుకున్నాయి అందుకే డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్న యానిమల్ సినిమా కూడా సక్సెస్ అవుతుందని భావిస్తోంది.