రెడ్ల వారసులకి సీట్లు ఫిక్స్..వారి పొజిషన్ ఏంటి?

వచ్చే ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు..అటు టి‌డి‌పి, ఇటు వైసీపీలో వారసులు చాలామంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు లైన్ లో ఉన్నారు. అందరూ సీనియర్ నేతల వారసులే..సీట్లు ఆశిస్తున్నారు. కానీ సి‌ఎం జగన్ ఇప్పటివరకు ఇద్దరు, ముగ్గురుకు తప్ప మిగతా సీనియర్ నేతల వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపించడం లేదు.

ఈ సారి కూడా తనతో పాటే పోటీ చేయాలని సీనియర్లకు సూచిస్తున్నారు. అయితే సీట్లు దాదాపు ఖరారైన ఎమ్మెల్యే వారసులు వచ్చి..చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు సొంత ప్లేస్ అయిన చంద్రగిరి నుంచి రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డి..ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదు. తన బదులు తన వారసుడు మొహిత్ రెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నారు. ఈ మేరకు జగన్‌కు విన్నవించుకుంటే..జగన్ సైతం..చెవిరెడ్డి వారసుడు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

దీంతో చెవిరెడ్డి వారసుడు పోటీ చేయడం ఖాయం. అటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఇటీవలే టి‌టి‌డి ఛైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో భూమన తనయుడుకు తిరుపతి సీటు ఖాయమని అంటున్నారు. అటు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి వయసు మీద పడింది. ఇప్పటికే తన తనయుడుకు సీటు ఇవ్వాలని ఆయన కోరారు.

అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే రెడ్డి ఎమ్మెల్యేల వారసులకే దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు, విశ్వరూప్, తమ్మినేని సీతారాం..ఇంకా పలువురు సీనియర్ల వారసుల పోటీకి అంగీకారం వచ్చినట్లు లేదు.