అనసూయ పొలిటికల్ ఎంట్రీ.. జాతకం చెప్పేసిన వేణు స్వామి..!!

నిత్యం సెలబ్రిటీల పెళ్లిళ్లు విడాకుల విషయంలో జోక్యం చేసుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు ఆస్ట్రాలజీ వేణు స్వామి.. ఎంతోమంది నటీనటుల జాతకాలను తెలియజేస్తూ వారి జాతకాలలో దోషం ఉన్నాయంటు పూజలు చేస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు వేణు స్వామి ఇప్పుడు తాజాగా యాంకర్ అనసూయ గురించి కొన్ని విషయాలు చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె భవిష్యత్తు పైన వేణు స్వామి చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రీసెంట్ గా అనసూయ కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.. దీంతో అనసూయకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ జాతకం పైన వేణు స్వామి మరొకసారి రిపీట్ చేయడం జరిగింది.. 2021 తరువాత అనసూయ జాతకం పూర్తిగా మారిపోయిందని ఆమె లైఫ్ లో డ్రాస్టిక్ చేంజ్ వస్తుందని వేణు స్వామి తెలియజేశారు. ఆమెకు తిరుగు ఉండదని చాలాకాలం పాటు టాప్లోకి వెళ్లిపోయి ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతుందని కూడా తెలిపారు.

Anasuya Bharadwaj Age, Family, Husband, Movies, Biography - Breezemasti

అంతేకాకుండా అనసూయ రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తన అభిప్రాయంగా తెలియజేశారు. 2021 ప్రకారం అనసూయ క్రేజ్ బాగానే పెరిగింది..బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చి బాగానే రెస్పాన్స్ అందుకున్నది. మరి అనసూయ వేణు స్వామి చెప్పినట్టుగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఇటీవల కాలంలో పలు వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది