బాబి సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌..!

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత నట‌సింహ బాలయ్య – బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఇక తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ కి ఓ వీక్‌నెస్ ఉంటుందట. బాలకృష్ణ మతిమరుపుతో బాధపడుతూ ఉంటాడని సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్లే మొత్తం ఈ వీక్‌నెస్ మీదే నడుస్తూ ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ తో పాటు కామెడీ సీన్స్ కూడా హైలెట్స్ గా నిలవబోతున్నాయట. మరి ఈ సినిమాలో బాబి.. బాలయ్య ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ను రాస్తాడో చూడాలి. అన్నట్లు ఈ సినిమా బాలయ్య మార్క్ టైప్ యాక్షన్ డ్రామా కాదు ఇది ఓ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ మూవీ అని తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం బాలయ్య క్యారెక్టర్ కు సంబంధించిన ఈ కొత్త న్యూస్ వైరల్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ కామెడీ యాంగిల్ లో బాలయ్య ఎలా కనిపిస్తారు అని ఆత్రుతగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య‌ ఈసారి కొత్తగా కనిపించబోతున్నారు.అలాగే ఈ మూవీలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్‌రోల్ ప్లే చేస్తున్నాడట.