సీమలో టీడీపీకి ఒకటే..వైసీపీ తగ్గట్లేదు.!

రాయలసీమ అంటే రాజకీయంగా వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు. రాష్ట్రంలో పరిస్తితులు ఎలా అయిన ఉన్నా సీమలో మాత్రం వైసీపీ హవానే ఉంటుంది. అంటే సీమపై వైసీపీకి ఉన్న గ్రిప్ అలాంటిది. అలాగే అక్కడ రెడ్డి సామాజికవర్గం ఎక్కువ..దీంతో అంతకముందు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇలా సీమపై పట్టు ఉండటంతోనే గత ఎన్నికల్లో వైసీపీ 52 సీట్లకు 49 సీట్లు గెలుచుకుంది.

అటు 8 ఎంపీ సీట్లని గెలుచుకుంది. ఇలా వైసీపీ సత్తా చాటింది. ఇప్పటికీ అక్కడ వైసీపీకే ఆధిక్యం ఉంది. ఇక ఎంపీ సీట్లలో వైసీపీ జోరు కొనసాగుతుంది. ఈ సారి కూడా ఎంపీ సీట్లలో వైసీపీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. సీమలో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, రాజంపేట, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లోనే వైసీపీ..తిరుపతి, రాజంపేట, కడప, కర్నూలు, నంద్యాల సీట్లు గెల్చుకుంది. టి‌డి‌పి మాత్రం హిందూపురం, అనంత, చిత్తూరు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 8కి 8 వైసీపీ గెలుచుకుంది.

మరి ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి కాస్త పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వైసీపీ పోటీ లేకుండా గెలిచే సీట్లు కడప, తిరుపతి, నంద్యాల, రాజంపేట సీట్లు. ఇక చిత్తూరు, కర్నూలులో కాస్త పోటీ ఎదుర్కోవాలి. అనంత, హిందూపురంలో పోటీ ఉంటుంది. కానీ ఈ రెండిటిల్లో టి‌డి‌పి ఒక సీటు గెలుచుకునే ఛాన్స్ ఉంది.

అంటే టి‌డి‌పి ఒక సీటు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది..ఇంకా గాలి ఏమైనా మారితే,. రెండు సీట్లు రావచ్చు. అంతే తప్ప వైసీపీ ఆధిక్యాన్ని మాత్రం తగ్గించలేదు.