“వాళ్లంత దొంగ నా కొడుకులు..అస్సలు ప్రేమించకండి”..హీరోయిన్ దీపిక పదుకొనే షాకింగ్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ చాలా బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ అభిమానులను సైతం షాక్ కి గురి చేస్తున్నారు . ఆ లిస్ట్ లోకే అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకున్న దీపిక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది . ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తుంది . త్వరలోనే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే దీపిక తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “మీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోండి.. ఈ విషయాన్ని నేను తేలిగ్గా చెప్పడం లేదు ..ఎందుకంటే మీరు ప్రేమలో పడే వ్యక్తి నిజమైన – బలమైన – సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వగలిగితే మీ కంటే గొప్పగా జీవించే వ్యక్తి మరొకరు ఉండరు . పైకి మాటలు చెబుతూ మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మోసం చేసే వాళ్ళని నమ్మకండి . అలాంటి వాళ్ళని దూరం పెట్టండి . మీరు ఎవరితో అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో వారిని వెతుక్కోండి. మరీ ముఖ్యంగా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీ అభిరుచులను గౌరవించే వాళ్లను పెళ్లి చేసుకోండి ” అంటూ ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అంటూ రాసుకొచ్చింది.

దీనికి రన్వీర్ సింగ్ సైతం స్పందిస్తూ హార్ట్. సింబల్ ని షేర్ చేశారు అయితే దీపిక ఇంత ఘాటుగా స్పందించడానికి కారణం ఆమె గతంలో ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పడమే అంటూ తెలుస్తుంది . ఆ స్టార్ హీరో ఎవరో కూడా అందరికి తెలిసిందే . ప్రజెంట్ మరో స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . దీపికా పదుకొనేని ఆ హీరో నమ్మించి మోసం చేశాడట. అందుకే అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి అంటూ సజెస్ట్ చేస్తుంది దీపిక. మరికొందరు దీపిక కామెంట్స్ కి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ” మీరు చెప్పింది నిజమే మేడం.. అలాంటి దొంగ నా కొడుకులని ప్రేమించకుడదు”.. అంటూ దీపికాకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో దీపిక పదుకొనే చేసిన పోస్ట్ వైరల్ గా మారింది..!!