టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ అందం కోసం అలాంటి పనులు చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ అభిమానులు .మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శృతిహాసన్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . దానికి కారణం శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలో నటించి హిట్ అందుకోవడమే.
ఒకటి వాల్తేరు వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా.. రెండోది వీర నరసింహరెడ్డి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా నటించి మెప్పించింది . రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న శృతిహాసన్ కెరియర్ ఓ రేంజ్ లో మలుపు తిరగడానికి కారణం ఈ రెండు సినిమాలే. ప్రజెంట్ ఆమె పాన్ ఇండియా మూవీ సల్లార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది .
ఇలాంటి క్రమంలోనే అభిమానులతో నిరంతరం సోషల్ మీడియా ద్వారా చిట్ చాట్ చేసే శృతిహాసన్ తన అందం కోసం ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంది అనే విషాయాని బయటపెట్టింది. అంతేకాదు ఫుడ్ డైట్ లాంటివి తూతూ మత్రంగా పాటిస్తుందట. కానీ తిన్న తరువాత మాత్రం వాకింగ్ నిక్కచ్చిగా ఫాలో అవుతుందట. ఇష్టమైన ఫుడ్ని కడుపునిండా తినేసి ఒళ్ళు అలసిపోయేలా వర్క అవుట్స్ చూస్తుందట. అంతేకాదు తన అందం కోసం రకరకాల ప్రోడక్ట్ లాంటివి ఏమీ వాడదట. ఉన్న లుక్స్ ని మెయింటైన్ చేసే విధంగా కొనసాగుతూ వస్తుందట . దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ బాడీ ఫిజిక్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డైటింగ్ చేయడం ఇష్టం లేని వాళ్లు ఈ టిప్ ఫాలో అయ్యి సెక్సీ గా తయారవ్వండి అంటూ చెప్పుకొస్తున్నారు..!!