షాక్‌: వైద్యానికి డ‌బ్బుల్లేక షాపింగ్‌మాల్ సినిమా న‌టి మృతి…!

సినీ సెలబ్రిటీస్ అనగానే చాలామంది జనం కోట్లకు కోట్లు గడిస్తారు, లగ్జరీ లైఫ్ అని ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. ఆ అదృష్టం చాలా తక్కువ మందికే దక్కుతుంది. నిజం చెప్పాలంటే హీరో, హీరోయిన్లకు మాత్రమే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుతుంది. కరెక్ట్ ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది. ఇక సైడ్ క్యారెక్టర్ లో చిన్న చిన్న రోల్స్ చేసే వారికి డబ్బులు అంతంత మాత్రమే ఇస్తారు. వారు సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేక ప్రాణాలు వదిలింది.

సోమవారం తెల్లవారుజామున 2 గంట‌ల‌ 15 నిమిషాలకు ఆమె తనువు చాలించింది. తెలుగమ్మాయి అంజలి నటించిన షాపింగ్ మాల్ సినిమా గురించి చాలామందికి తెలుసు 2010లో రిలీజైన‌ ఈ సినిమాలో సింధు(44)అనే అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ రూల్స్ ప్లే చేసిన ఈమె 2020లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు చిన్నభిన్నమయ్యాయి. మధ్యతరగతి కుటుంబం.. దానికి తోడు క్యాన్సర్ ఆమెను చుట్టుముట్టడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతుంది.

ఇటీవల ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చేసేదేమీ లేక కిలిపకంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడే డబ్బులేక ప్రాణాలు వదిలింది. చిన్న వయసులోనే సింధు మరణించడంతో తోటి నటీనటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈమె చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను పడింది 14 ఏళ్లకే తల్లిదండ్రులు ఇమెకి వివాహం చేయగా అదే ఏడాది ఒక బిడ్డకు జన్మనిచ్చిన సింధు నటి అయిన తర్వాత సమస్యలు తగ్గుతాయి అనుకుంటే.. క్యాన్సర్ మహమ్మారి ఈమెను కబళించేసి కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది.