టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికి యూత్‌లో అదే క్రేజ్ కలిగి ఉన్నారు. అలాంటి నటిమనుల్లో సీనియర్ యాక్టర్ రంభ ఒకటి. దివ్యభారతి ఆకస్మిక మరణంతో తొలిముద్దు సినిమాలో ఆమె పాత్రలో నటించి మెప్పించిన రంభ తర్వాత ఇవీవీ సత్యనారాయణ రూపొందించిన ఆ ఒకటి అడక్కు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తన అందంతో పాటు అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రంభ తర్వాత వరస అవకాశాలను దక్కించుకుంది.
తెలుగులోనే కాక హిందీ, మలయాళ భాషల్లోనూ నటించింది. ఈమె అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఒక తెలుగమ్మాయి ఆ రేంజ్ లో ఎదగడం అనేది మొదటిసారి. బాలీవుడ్ స్టార్ డామినేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో తెలుగు అమ్మాయి ఇంత గొప్ప స్థానాన్ని తెచ్చుకోవడంతో చాలామంది స్టార్ హీరోయిన్‌లు జీర్ణించుకోలేకపోయారు. అలా జలస్ ఫీల్ అయి ఆమెపై చాలా రకాల దుష్ప్రచారాలను చేశారని రంభ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లోనూ రంభకు ఛాన్సెస్ బాగానే వచ్చాయి. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోస్‌తో ఆమె నటించి మెప్పించింది. భోజపురిలో సూపర్ స్టార్ రవి కిషన్.. రేసుగుర్రం మూవీలో విలన్. అతనితో రంభ ఎన్నో సినిమాల్లో నటించింది. దీంతో రంభ అంటే నచ్చని ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పనికట్టుకుని మరి రవికిషన్ – రంభల మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు సృష్టించారు.
లవ్ ఫెయిల్ అవడంతో రంభ సూసైడ్ చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై స్పందించిన రంభ అవి కేవలం పుకార్లు మాత్రమేనని రవికిషన్ తనకు పెద్ద అన్న లాంటి వారిని స్పష్టం చేసింది. కేవలం ఇలాంటి రూమర్స్ ఎక్కువ కావడంతోనే ఆమె సినిమాలకు దూరమైందట. అప్పట్లో రవికిషన్‌తో ప్రేమాయణం నడిపిన ప్రముఖ హీరోయిన్ నగ్మా కావాలనే రంభపై ఇటువంటి పుకార్లు పుట్టించింది అంటూ వార్తలు వినిపించాయి.