పోలవరం రాజకీయం..ఎవరు కరెక్ట్?

ఏపీ జీవనాడి పోలవరం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మరింత నష్టపోకూడదని చెప్పి..కేంద్ర ప్రభుత్వమే పోలవరం కట్టిస్తామని చెప్పింది..అలాగే జాతీయ హోదా ఇచ్చింది. అయితే కేంద్ర పరిధిలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదో ఏమో గాని..దాన్ని కావాలని టి‌డి‌పి హయంలో చంద్రబాబు తామే నిర్మిస్తామని తీసుకున్నారు. 2018లోనే పూర్తి చేస్తామని హడావిడి చేశారు.

కానీ అది పూర్తి కాలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం. అడపాదడపా పోలవరం పూర్తి చేయడంపై పలుమార్లు డేట్లు ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ఇప్పుడు 2025కి పూర్తి అయిపోతుందని అంటున్నారు. అయితే ఇలా ఆలస్యం అవ్వడానికి గత చంద్రబాబు ప్రభుత్వం..పోలవరం నిర్మాణంలో చేసిన లోపాలు కారణమని వైసీపీ అంటుంది. అసలు తామే పోలవరం నిర్మాణాన్ని పరుగులు తీయించామని, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసిందని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు పోలవరంపై రాజకీయం చేస్తున్నారు.

తాజాగా కూడా జగన్, చంద్రబాబు పోలవరం పర్యటించారు. జగన్ ఏమో పోలవరం నిర్వాసితులని పరామర్శించడానికి వెళితే..చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలించడానికి వెళ్లారు. ఒకే రోజు ఇద్దరు నేతల టూర్లు సాగాయి. అయితే నిర్వాసితులకు ప్యాకేజ్ కేంద్రం మాత్రమే ఇవ్వాలని తాము అందుకోసమే చూస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే ప్రాజెక్టు ఎత్తుని 45.72 కాంటూర్ లెవెల్ నుంచి 41.5కి తగ్గించి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే ఏ లెవెల్ లో ఉన్న రెండు స్థాయిలోనూ అవే గ్రామాలు ముపుకు గురవుతాయని అలాంటప్పుడు ఎవరి కోసం ఎత్తు తగ్గిస్తున్నారని బాబు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు పోలవరంపై రాజకీయం నడిపిస్తున్నారు. ఇక ఇందులో ఎవరి వాదన కరెక్ట్..ఎవరు పోలవరంకు న్యాయం చేస్తారనేది ప్రజలే తేల్చుకోవాలి.