కీరవాణి కొడుకు పై నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

మెగా హీరో నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో నెలరోజుల క్రితం విడాకుల ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిహారిక మాత్రం తన స్నేహితులతో కలిసి పలు రకాల వెకేషన్ కి వెళ్లడం పార్టీలు వంటివి చేసుకోవడంతో తెగ ఎంజాయ్ చేస్తోంది. నిహారికకు ఎలాంటి విషయాన్నైనా సరే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇలా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటున్న నిహారిక నిత్యం తనకు సంబంధించిన విషయాలను షేర్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు గ్లామర్ విందు కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కుమారుడు కాలభైరవతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. కాలభైరవ పుట్టినరోజు సందర్భంగా ఈమె తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది నిహారిక.

హ్యాపీ బర్తడే బాబు నువ్వే మా జీవితాలలో వెలుగును తీసుకువచ్చావ్ థాంక్యూ లైట్స్ హావ్ ఫన్ డే అంటూ కాలభైరవతో దిగిన కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిహారిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.నిహారిక కాలభైరవ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే వీరిద్దరూ పలు రకాల పార్టీలలో కూడా కనిపిస్తూ ఉంటారు ప్రస్తుతం నిహారిక విషయానికి వస్తే ఈమె నిర్మాణ సంస్థను స్థాపించి పలు రకాల వెబ్ సిరీస్లను సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటుంది.