హీరో ఆబ్బాస్ నటుడు విశాల్ కి మధ్య విభేదాలు రావడానికి కారణం అదేనా..?

టాలివుడ్ ప్రేక్షకులకు అలనాటి హీరో అబ్బాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ప్రేమదేశం అనే సినిమా ద్వారా మొదటిసారి హీరోగా పరిచయమైన అబ్బాస్ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలదు. ముఖ్యంగా తన హెయిర్ స్టైల్ తో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. మరి చిత్రాలలో కూడా పలు పాత్రలలో నటించి మెప్పించిన అబ్బాస్ కొద్ది కాలానికి ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అలా ఒకవైపు అవకాశాలు తగ్గడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడడంతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో కూడా తన మదిలో వచ్చాయని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడ సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు.. పెట్రోల్ బంకులో కొద్దిరోజులు పనిచేయగ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి అబ్బాస్ పేరు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది.

గత కొద్దిరోజుల క్రితం అబ్బాస్ ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అక్కడ ఒక తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలియజేశారు. అందులో హీరో విషయాలతో జరిగిన గొడవ గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తనపై విశాల్ అసత్య ప్రచారాలు చేశారని అతనితో ఎప్పటికి సన్నిహితంగా ఉండనంటూ కూడా తెలియజేశారు. విశాల్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉండవచ్చు కానీ కొన్నేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగల్ విషయంలో తనతో ప్రవర్తించిన తీరు మాత్రం తనకి నచ్చలేదని అతని చేసిన పనికి కోపం వచ్చిందని అతడిని ఎప్పుడో క్షమించేసానని కూడా తెలిపారు. కనపడితే మాట్లాడుతాను తప్ప సన్నిహితంగా ఉండానని తెలిపారు. CCL రెండవ సీజన్లో అతనికి ఏదో గొడవ జరిగింది.. దీంతో తన పైన అసత్య వ్యాఖ్యలు చేశారు అలాగే ఇతరులను కూడా పాడు చేశాడు తను ఇష్టపడని వాతావరణంలో ఉండడం ఇష్టం లేకనే అక్కడి నుంచి వచ్చేసానని తెలిపారు.