బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జనీ ఊచ‌కోత‌.. `జైల‌ర్‌` ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి వ‌చ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `జైల‌ర్‌`. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివరాజ్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళ హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జ‌నీ ఊచ‌కోత కోశారు.

తాజాగా జైల‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా.. తొలి రోజే ఏకంగా రూ. 7.01 కోట్ల షేర్‌, రూ. 12 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుని దుమ్ము దుమారం రేపింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం రూ. 3.21 కోట్ల షేర్ ను అందుకుంది. అలాగే సీడెడ్ లో రూ. 94 ల‌క్ష‌లు, ఉత్త‌రాంద్ర‌లో రూ. 81 ల‌క్ష‌లు, ఈస్ట్ లో రూ. 40 ల‌క్ష‌లు, వెస్ట్ లో రూ. 33 ల‌క్ష‌లు, గుంటూరులో రూ. 65 ల‌క్షలు, కృష్ణ‌లో రూ. 45 ల‌క్ష‌లు మ‌రియు నెల్లూరులో రూ. 22 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. మ‌రో రూ. 5.99 కోట్లు క‌లెక్ట్ చేస్తే తెలుగులో జైల‌ర్ క్లీన్ హిట్ అవుతుంది.

ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో జైర‌ల్ వ‌చ్చింది. అయితే తొలి రోజు ప్ర‌పంచవ్యాప్తంగా రూ. 44.75 కోట్ల షేర్‌, రూ. 91.20 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుని అరాచ‌కం సృష్టించింది. తొలి రోజై ఆల్మోస్ట్ వంద కోట్ల క్ల‌బ్ కి చేరువైంది. ఈ లెక్కన‌ జైల‌ర్ వ‌ర‌ల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో రూ. 79.45 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. టాక్ పాజిటివ్ గా ఉండ‌టంతో.. ఇక ర‌జ‌నీ వీర విహారం ఖాయమని చెప్పొచ్చు. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా జైల‌ర్ ఫ‌స్ట్ డే గ్రాస్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి.

మిళనాడు – 22.85 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 12.50 కోట్లు
క‌ర్ణాటక- 11.80 కోట్లు
కేరళ – 5.85 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- 3.10 కోట్లు
ఓవర్సీస్ – 35.10 కోట్లు
——————————
వ‌ర‌ల్డ్ వైడ్ కలెక్షన్లు = 91.20 కోట్లు(44.75కోట్లు~ షేర్)
——————————