భారతీయ సినీ చరిత్రలోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆగస్టు సినిమాలు ఇవే..!

మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆగస్టు 2023 ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప‌లు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో రజనీకాంత్ జైలర్ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా జైలర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తుంది.

Gadar 2 - Wikipedia

ఇక మరోవైపు హిందీలో గదర్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. సన్నీ దేఓల్ నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.460 కోట్లకు పైగా గ్రాస్ కలక్షను రాబడినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు చేసుకుంటే రూ.700 కోట్ల గ్రాస్‌ దాటాయి. ఆగస్టు నెలలో తెలుగు నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకు ముందుకు వచ్చాయి. వాటిలో జైలర్, భోళా శంకర్, గదర్ 2, బెదురులంక 2012 ఇలా చిన్న పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో జైలర్, ఓఎంజి 2 గదర్2 సినిమాలు మాత్రం మంచి టాక్ ను అందుకున్నాయి.

బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఇలా హిట్ టాక్ అందుకున్న అన్ని సినిమాల్ల కలెక్షన్లు కలిపి ఒకే నెలలో అది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటడం ఈ భారతీయ సినీ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు. ఇప్పటివరకు ఒక నెలలో అత్యధిక కలక్షన్లు రాబట్టిన హిందీ సినిమాల్లో చూసుకుంటే గదర్ 2 టాప్‌ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కే జి ఎఫ్ 2, ది కాశ్మీర్ ఫైల్స్, వార్, బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. ఇక రాబోయే సెప్టెంబర్ నెలలో కూడా మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి.

Jailer: Rajinikanth shown as an authoritarian in the first look; Superstar  kickstarts shoot today | PINKVILLA

సెప్టెంబర్ నెల మొత్తం పాన్ ఇండియా సినిమాలతో పాటు మాస్ కమర్షియల్ సినిమాలు కూడా వస్తున్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ- సమంతల ఖుషి, షారుక్ ఖాన్ జవాన్, రామ్ స్కంద, లారెన్స్ చంద్రముఖి 2, విశాల్ మార్క్ ఆంటోనీ, చివరిగాప్రభాస్ సలార్ సినిమాలు వస్తున్నాయి. మరి ఆగస్టు రికార్డులను ఈ సినిమాలు బ‌ద్ద‌లు కొడతాయ‌ని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి.