`గాండీవధారి అర్జున` టైటిల్ వెన‌క ఎంత అర్థ‌ముందో తెలిస్తే మ‌తిపోతుంది!?

గాండీవధారి అర్జున.. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మించారు. ఇందులో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య జంట‌గా న‌టించారు. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

రేపు ఈ చిత్రం అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే నష్టాల గురించి ప్ర‌స్తావిస్తూ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో సెక్యురిటీ ఎక్స్ పర్ట్ అర్జున్ గా వ‌రుణ్ తేజ్ న‌టించాడు. టీజ‌ర్, ట్రైల‌ర్ తో పాటు ప్రమోష‌న్స్ ద్వారా ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. వ‌రుణ్ తేజ్ కూడా ఈ మూవీపై చాలా ధీమాగా ఉన్నాడు.

ఇక‌పోతే ఈ సినిమాకు అస‌లు గాండీవధారి అర్జున అనే డిఫ‌రెంట్ టైటిల్ ను ఎందుకు పెట్టారు..? అన్న ప్ర‌శ్న‌ చాలా మందిలో ఉంది. అయితే `గాండీవధారి అర్జున` టైటిల్ వెన‌క ఎంత అర్థ‌ముందో తెలిస్తే మ‌తిపోతుంది. ఇంద్రుడు వరంగా ఇచ్చిన ధనుస్సుతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేస్తాడు. ఆ ధనుస్సు పేరే గాండీవ. ఆ ఆయుధం పట్టుకున్న స‌మ‌యంలో అర్జునుడు ఎంత భయంకరంగా ఉంటాడో.. ఈ సినిమాలో ఎం 4 కార్బైన్ గన్ పట్టుకున్న హీరో అంతే ప‌వ‌ర్ ఫుల్‌గా కనిపిస్తాడట‌. అందుకే ఈ సినిమాకు గాండీవధారి అర్జున టైటిల్ పెట్టామని తాజాగా డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు వెల్ల‌డించారు.