పుష్ప 2లో బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ లెక్క‌లు చూస్తే ఫ్యీజులు ఎగురుతాయ్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన మూవీ పుష్ప. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా రూ.350 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. బన్నీ ఈ సినిమాకు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.

ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వల్ గా వస్తున్న పుష్పటు ఎలాగైనా హిట్స్ సాధించాలనే ఉద్దేశంతో సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ పై ఏడాది పాటు వర్క్ చేశాడట. ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్లో అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

అయితే పార్ట్ 2 లో నటించడానికి అందరి నటీనటులకు కలిపి రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ అవుతుందట. వీరిలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తెలిసి ఫీజులు ఎగిరిపోతున్నాయి. కేవలం అల్లు అర్జున్‌కే రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట‌. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.