పొరపాటున కూడా ఈ టైమ్‌లో ఫోన్ యూజ్‌ చేయకూడదట‌.. యూజర్లకు యాపిల్ వార్నింగ్..!!

క్షణం పాటు మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. మొబైల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఫోన్ వల్ల చాలామందికి మానసిక ప్రశాంతత, నిద్ర లేకుండా బాధపడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్ చార్జింగ్ పెట్టి పక్కనే నిద్రపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఐ ఫోన్ల తయారీ యాపిల్ సంస్థ కూడా వినియోగదారులకు స్పష్టమైన సూచనలు చేసింది.

ముఖ్యంగా ఫోను పక్కన పెట్టుకుని పడుకునేవారు, లేదా చార్జింగ్ పెట్టి ఫోన్ పక్కనే ఉంచుకునేవారిని హెచ్చరించింది. ఈ సూచనలను తన ఆన్లైన్ యూజర్ గైడ్ లో తెలిపింది. ఐఫోన్‌ని సరైన వెలుగున్న వాతావరణం లోను, టేబుల్ వంటి ఫ్లాట్ ఉపరితలాలపై పెట్టి చార్జింగ్ చేయాలని తెలిపింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై చార్జింగ్ పెట్టడానికి సాహసం చేయవద్దు. చార్జింగ్ సమయంలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.

ఈ వేడిని సులభంగా ఉత్పత్తి చేయలేకపోవడం వంటి సమస్య ఎదురైతే ఫోన్ కింద భాగం కాలిపోవడం, తీవ్రమైన మంటలు ఏర్పడడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఫోను చార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, చార్జింగ్ వైర్ పై నిద్రించవద్దని తెలిపింది. అలాగే పాడైన కేబుల్స్, చార్జర్లను ఉపయోగించవద్దని సలహా ఇచ్చింది. అలాగే ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు వాడడమే కాదు.. సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. సిగ్నల్ లేకపోతే కొంత రేడియేషన్ పెరిగి ఫోన్ కాలిపోయే అవకాశం ఉంది. అందువల్ల సిగ్నల్స్ లేనప్పుడు కూడా ఫోన్ యూస్ చెయ్యొద్దు.