దారుణంగా అవమానపడ్డ రజనీకాంత్.. రివెంజ్ ఎలా తీర్చుకున్నారంటే..?

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు రజనీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రజినీకాంత్ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే నట. రజనీకాంత్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన..తన కెరియర్ మొదట్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అలా ఒక నిర్మాత రజనీకాంత్ ను చాలా ఘోరంగా అవమానించారట.

Without alcohol, I would have been a better person: Rajinikanth

ఒక చిత్రంలో మంచి పాత్ర ఉందంటూ రజనీకాంత్ నటిస్తే బాగుంటుంది అంటూ నిర్మాత రజనీకాంత్ ను కలిసి చెప్పారట. అందుకు రెమ్యూనరేషన్ కూడా రూ.6000 రూపాయలు ఇస్తానని చెప్పారట. అడ్వాన్స్ ఇవ్వమని రజనీకాంత్ కోరగా వేయి రూపాయలు మరుసటి రోజు ఇస్తానని కారు పంపిస్తానని కారులో షూటింగ్కు రావాలని సదురు నిర్మాత రజనీకాంత్ ని కోరడం జరిగిందట. అలా మరుసటి రోజు నిర్మాత కోరిక మేరకు రజనీకాంత్ కారులు షూటింగ్ లోకేషన్ కి వెళ్లడం జరిగిందట.

అక్కడికి వెళ్లిన రజనీకాంత్ కు ఆ నిర్మాత అడ్వాన్స్ ఇవ్వకపోవడమే కాకుండా నువ్వేమైనా తోపు హీరో అనుకుంటున్నావా అంటూ గోరంగా అవమానించారట.. దీంతో రజనీకాంత్ రిటర్న్ వెళ్లిపోతానని చెప్పగా నీ ముఖానికి కారు అవసరమా అంటూ నిర్మాత అవమానించారట. అవమానం గుర్తించుకున్న రజనీకాంత్ ఈ ఘటిన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షల రూపాయలు కారును తీసుకువెళ్లి ఆ నిర్మాత ఉన్న స్టూడియో కు వెళ్లి ఆ స్టూడియోలోనే కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ కాల్చేవారట. రజనీకాంత్ ఆ నిర్మాతను అవమానించాలని ఫిక్స్ అవ్వడంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది.