టిడిపి అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనకు వెళ్ళి..అక్కడ పూల అంగళ్ళ సెంటర్‌లో సభ నిర్వహించారు. సభకు ఓ మాదిరిగానే జనం వచ్చారు. అయితే కేవలం పులివెందుల వాళ్ళు మాత్రమే కాదు..చుట్టూ పక్కల నియోజకవర్గాల వారు వచ్చారు. అయితే ఇంకా ఆ జనం చూసి..పులివెందుల పసుపుమయం అయిపోయిందని టిడిపి శ్రేణులు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు.
అంటే పులివెందులని కూడా టిడిపి గెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి అది సాధ్యమయ్యే పని కాదనే సంగతి బాబుకు కూడా తెలుసు. కాకపోతే ఏదో టిడిపి కార్యకర్తల ఉత్సాహం కొరకు అలా మాట్లాడేశారు. అయితే జగన్, వైసీపీ నేతలు చాలా రోజుల నుంచి వై నాట్ కుప్పం అంటున్నారు. అలా అనడానికి కారణాలు ఉన్నాయి. కుప్పంలో బాబు మెజారిటీ తగ్గుతుంది. పైగా పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అందుకే కుప్పం అసెంబ్లీని సైతం సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు. అందులో తప్పులు లేదు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వైసీపీకి ఉంది.
కానీ పులివెందుల అలా కాదు. అక్కడ జగన్ మెజారిటీ ఫుల్ గా ఉంది. గత ఎన్నికల్లో బాబుకు కుప్పంలో మెజారిటీ 30 వేలు అయితే..పులివెందులలో జగన్‌కు 90 వేలు పైనే. అంటే ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి వై నాట్ పులివెందుల అనేది కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే..ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఏదో పులివెందులలో సభ కాబట్టి బాబు కాస్త హడావిడి చేశారు.
అయితే పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గించిన చాలు టిడిపి సక్సెస్ అయినట్లే. కానీ అది కూడా జరిగే పనిలా లేదు.