ప్రభాస్ కూడా అలాంటి వారే.. డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమా నేచురల్ హర్రర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Director's Maruti's Daughter's Art Show In Hyderabad

అయితే ప్రభాస్ మారుతి సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ గురించి డైరెక్టర్ మారుతి కూతురు హీమా దాసరి మాట్లాడుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రభాస్ చాలా మంచివారు హుందాగా గర్వం లేకుండా ఎంత వినయంగా అందరితో కలిసిపోతూ ఉంటారని ఆయన నుంచి మనం చాలానే నేర్చుకోవాలి అంటూ తెలియజేసింది.

Prabhas' Film With Maruthi Leaked Details Rubbished, Director Says "Please  Refrain From Any Rumours About..."

అంతేకాకుండా ప్రభాస్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టము నాకు కూడా ఫుడ్ అంటే ఇష్టం.. ఇక సెట్ లో ప్రభాస్ అందరికీ ప్రేమగా భోజనం పెడుతూ ఉంటారు ఎదుటివారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని ఆయనే ఈ విషయంలో నాకు స్ఫూర్తి అంటూ తెలియజేసింది హీమా దాసరి.. ప్రభాస్ అభిమానులు ఈమె మాటలు విని తెగ సంబరపడిపోతున్నారు. మారుతి కూతురు పెయింటింగ్ లో మంచి ప్రావీణ్యం కలదు ఇటీవల ఒక ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేసింది.