ఆస్పత్రిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఫ్యాన్సులో ఆందోళన..!!

ది కేరళ స్టోరీ సినిమాతో అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది హీరోయిన్ ఆదాశర్మ.. చాలా కాలానికి తనకు ఒక సరైన సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాది ఉత్తరాది అని విభేదం లేకుండా ఈ సినిమా అన్నిచోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఆదాశర్మ ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం కమెండో అనే ఓటిటి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలకు ముందే ఆదాశర్మ సెట్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదాశర్మ కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం.

The Kerala Story actress Adah Sharma health suddenly worsened admitted to  hospital know the reason | 'द केरल स्टोरी' की एक्ट्रेस अदा शर्मा की अचानक  बिगड़ी तबियत, अस्पताल में हुईं भर्ती ...

దీంతో ఆమె పరిస్థితి స్కీనించడంతో నిన్నటి రోజున ఉదయం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ఏం జరిగిందంటే… నిన్నటి రోజున ఉదయం ఎక్కువగా వాంతులు చేసుకోవడంతో పాటు విరోచనాలు కూడా అయ్యాయట. దీంతో ఆహారం అలర్జీ ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇమే ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఆదాశర్మకు ఇలా కావడానికి ముఖ్య కారణం ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

కమెండో సిరీస్ లో ఈమె భావన రెడ్డి పాత్రలో నటిస్తోంది ఈ సిరీస్ ప్రేమ్ తో కలిసి ఈమె నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ట్రిమ్మింగ్ కు సిద్ధమవుతోంది.కమెండో సీజన్ 2 సీజన్ 3 లో కూడా తానే నటించబోతున్నట్లు తెలియజేసింది. ఇక ఇందులో కీలకమైన పాత్రలు అమిత్ సియాల్, శ్రేయ చౌదరి, మనీ చద్దా, తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు చివరిగా కేరళ స్టోరీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆదా శర్మ కి అనారోగ్యంగా ఉండడంతో అభిమానుల సైతం తీవ్ర అసహనానికి గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.