పవర్ ప్యాక్ కూడా రజినీకాంత్ ట్రైలర్.. మూవీ సక్సెస్ అయ్యేనా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమా ట్రైలర్ గడిచిన కొన్ని గంటల క్రితం రానే వచ్చింది ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా రజనీకాంత్ అభిమానులు మొత్తం ఈ సినిమా పైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. చిత్ర బృందం కూడా ఈ సినిమా ప్రమోషన్స్ సైతం వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ యాక్షన్ సన్నీ వేషాలతో అదరగొట్టేసారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Jailer Showcase: Rajinikanth unleashed as Tiger Muthuvel Pandian! Tamil Movie, Music Reviews and News

ఈ సినిమా లో ఎప్పటిలాగే రజనీకాంత్ తన పవర్ఫుల్ ప్రజెంటేషన్ నటనతో స్వాగ్ డైలాగ్ డెలివరీతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ విజువల్స్ త్రిల్లింగ్ ఎలివేన్స్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. మొదట ఈ చిత్రంలో రజనీకాంత్ తన పోలీస్ కొడుకు స్కూల్లు మనవడు శివ పాలిష్ చేస్తూ ఉన్నట్టుగా చూపించడం జరిగింది.. ఆ తర్వాత ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే అంటూ రజనీకాంత్ యాక్షన్ మోడ్ ని మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది.

చివరిగా రజనీకాంత్ చెప్పే డైలాగ్ కూడా హైలెట్ గా నిలుస్తోంది. అయితే రజనీకాంత్ సన్నివేశాలు అన్నిటికీ డైరెక్టర్ అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. రమ్యకృష్ణ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తోంది. అలాగే సునీల్ కూడా నటిస్తూ ఉన్నారు. మరి ఈసారైనా రజినీకాంత్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు.