కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల కావడం జరిగింది.

Tatamma Kala (1974)

రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పైన సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించగా ఈ సినిమాలో భానుమతి, హరికృష్ణ ,రాజబాబు తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ నియంత్రణ దిశగా అడుగులు వెయ్యండి అంటూ ప్రచారం చేసిందట.. అయితే తాతమ్మ కల సినిమాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కుటుంబ నియంత్రణ సినిమాకి వ్యతిరేకంగా ఇందులో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట.

తాతమ్మ కల సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ చిత్రం పైన కొన్ని రోజులపాటు బ్యాన్ విధించడం జరిగింది. ఒక విధంగా బాలయ్య మూవీ కేంద్రానికి చుక్కలు చూపించిందని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ అప్పటి కాంగ్రెస్ నేతలకు సినిమాలలోని సన్నివేశాలు వెనుక ఉద్దేశం తెరిపి మళ్లీ సీన్లలో మార్పులు చేసి 1975వ సంవత్సరం జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగిందట. చాలా బాలయ్య తన మొదటి సినిమాతోనే వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.