స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డా.. ట్రోలర్స్ కి అదిరిపోయే స‌మాధానం ఇచ్చిన బన్నీ..!!

‘పుష్ప ది రైజ్’సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం ఆక్రమ రవాణా చేసే పుష్ప రాజ్ అనే స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. దీనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో…స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు? అంటూ ట్రోలర్స్ మొదలయ్యాయి.

అయితే ఈ ట్రోలింగ్స్ పై తాజాగా బన్నీ స్పందించాడు. నేషనల్, ఆస్కార్ అవార్డ్స్ అనేది నటుడి యాక్టింగ్ చూసి ఇస్తారు. బ్యాట్ మెన్ లాంటి నెగటివ్ క్యారెక్టర్లకు ఆస్కార్ అవార్డు వచ్చింది. జంజీర్, అగ్నిపథ్ సినిమాల్లో అమితాబచ్చన్ నెగిటివ్ స్టెంట్స్ తో కూడిన డాన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన నటనకు నేషనల్ అవార్డులు వచ్చాయి.

పుష్ప సినిమాలో ఉన్న నటననే పరిగణంలోకి తీసుకొని ఆస్కార్ అవార్డ్ ఇచ్చారని అనుకుంటున్నా. అంతే కానీ కథవేపథ్యం, పాత్ర స్వభావం కాదని నా నమ్మకం, అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి