బన్నీకి ఆస్కార్‌ అవార్డు కూడా వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పోసాని..

మన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన ప్రేక్షకులను అలరించిన బన్నీ తాజాగా 69వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్బంగా బన్నీకి అనేకమంది సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి పోసాని కృష్ణ మురళీ, అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం పి ఆనందం వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

పోసాని మాట్లాడుతూ ‘ నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ తెలుగు నుంచి మొట్టమొదటి నేషనల్ అవార్డు గెలుచుకోవడం నాకు మరింత ఆనందంగా ఉంది. అలానే రాభోయే రోజుల్లో నేను కూడా ఇలాగే రాణించి ఆస్కార్ వరకు కూడా వెళ్తాను. అంతేకాకుండా ఆస్కార్ లో ఉత్తమ నటునిగా అవార్డు కూడా అందుకుంటాను ‘ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు . దీనితో పోసాని ఆస్కార్ అవార్డు పై చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీ లో వైరల్ గా మారింది.