జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న నేషనల్ క్రష్… రష్మిక ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..!?

ఛ‌లో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా డైరెక్టర్ సందీప్ గా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోవైపు పుష్ప2 సినిమా షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి సెకండ్ పార్ట్ లో కూడా తన నటనతో మెప్పించేందుకు రెడీగా ఉంది.

అయితే రష్మిక తన ఫిట్నెస్, బ్యూటీ విషయంలో రష్మిక బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ తన శరీరాన్ని ఆరోగ్యకరంగా.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకుంటుంది. నేషనల్ క్రష్ ఫిట్ నెస్ టిప్స్, సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా. వారానికి 4-5 సార్లు రష్మిక జిమ్ కు వెళ్తుంది. బలం, బరువు శిక్షణ, కార్డియో , కోర్ వ్యాయామాలు చేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్, వాకింగ్, కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంది.