8 క్లాస్ లోనే అలాంటి కోరికలు ఎక్కువైపోయాయి.. యుద్ధంలోకి దిగిపోయా అంటున్న స్టార్ హీరోయిన్..!

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది పంజాబీ ముద్దుగుమ్మ వామిక గబ్బీ. అయితే రీసెంట్ గా ఓటీపీ లోను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు చెప్తూ తన కెరియర్ సక్సెస్, స్ట్రగుల్ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘ఫాహిద్’ కరీనల ‘జబ్ వి మెట్’ నా మొదటి సినిమా. అప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న… ఇద్దరూ నన్ను చాలా గారాబం చేసేవాళ్లు.

ఆ తర్వాత ఒకటిరెండు సినిమాల తరువాత సెక్స్టీన్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యాను. నా మాతృభాష పంజాబీలో వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని ఊహించలేదు. ఇప్పుడు నా గురించి నాకే ఎన్నెన్నో ఊహలు వస్తుంటాయి. అవన్నీ చెబుతే మీకు విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పింది.

అలాగే సినిమాను కెరీర్గా అనుకోలేదన్న నటి… కెమెరా ముందు కనిపించడం అంటే సరదాగా ఉంటుందని, అదే తనను పరిశ్రమలో ఇంకా కొనసాగేలా చేసిందని తెలిపింది. చివరగా అనుకోకుండా తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందన్న వామిక… తెలుగు రాక ఎన్నో కష్టాలుపడాల్సి వచ్చిందని, ఏది ఏమైనా ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంటున్నట్లు వెల్లడించింది.