ఆమెను చూసి అందమే అసూయ పడుతుంది.. సౌందర్యమే తనతో పోటీ పడుతుంది.. ఎవరు గుర్తుపట్టగలరా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలకు బాగా గుర్తింపు వస్తుంది. ఓవైపు వరుస అవకాశాలు తెచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా శ్రీ లీల టాలీవుడ్లో దూసుకుపోతుంది. ఇక మరోవైపు రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమాతో బంపర్ హిట్ ను తన ఖాత‌లో వేసుకున్న తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. ఈ సినిమాతో తెలుగులోనే వైష్ణవికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం హీరోయిన్గా తనను తాను నిరూపించుకోవడానికి ఈ తెలుగు అమ్మాయిలు సిద్ధమవుతున్నారు..
అందులో ఈ అందాల తార కూడా ఒకరు. పైన ఫోటోలో చీరకట్టులో వయ్యరాలు పోతున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి తనే దివి వైద్య.

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ షోలోకి అడుగుపెట్టేవరకు దివి అంతగా పరిచయం లేని పేరు. కానీ ఈ షోలో తన అందం, అల్లరితనంతో కట్టిపడేసింది. దీంతో దివికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే అతి తక్కువ సమయంలోనే ఇంట్లోకి బయటకు వచ్చేసింది దివి. ఆ తర్వాత పలు ప్రైవేట్ సాంగ్స్ చేసిన దివి.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించింది.

 

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)