ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డును దక్కించుకుని పాపులర్ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమోగిపోతుంది. ఈ నేపద్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కొడుకు అయాన్ కి సంబంధించిన ఓ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి నటీ,నటుల జాతకాలు చెబుతూ ఎలా ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. అప్పటినుంచి కొంతమంది అయన్ని టార్గెట్ చేసి, ఆయన జాతకం చెప్పని వారి పేర్లను కావాలనే వైరల్ చేస్తూ వేణు స్వామి చెప్పారంటూ లేనిపోని పుకార్లు పుట్టిస్తూ ఆ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ని కూడా వదిలిపెట్టలేదు.. అయాన్ జాతకంలో దోషాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పారని పుట్టించారు. అల్లు అయాన్ జాతకం ఆయన చూడకపోయినా కావాలని కొంతమంది అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ కొడుకు జాతకంలో పెద్ద దోషం ఉందని ఆయన జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు, చేసుకుంటారనే వార్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో బన్ని అభిమానులు ఫైర్ అవుతున్నారు.