అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దూకుడిని తట్టుకోలేక.. కుప్ప కూలిపోయిన సినిమాలు ఇవే..!!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” సినిమాని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. టీజర్, ట్రైలర్ తోనే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమాలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డిలో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్ యూత్ పై చాలా ప్రభావం చూపింది. ఓ రకంగా అర్జున్ రెడ్డి అనేది ట్రెండ్ సెటెడ్‌ మూవీ అని చెప్పాలి.

అప్పటివరకు ఇలాంటి స్క్రీన్ ప్లే తో ఏ సినిమా రాలేదు. కథ పరంగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ ఉండదు. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్ళికి హీరోయిన్ తండ్రి ఒప్పుకోలేదు. దీంతో హీరోయిన్‌కి వేరే పెళ్లి చేసేస్తాడు. దీంతో హీరో డిప్రెషన్‌లోకి వెళ్లి పోతాడు. ఇలాంటి కథతోనే దేవదాసు చిత్రం వచ్చింది. కానీ స్క్రీన్ ప్లే పూర్తిగా వేరు. 2017 ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంది. ఈ సినిమాతో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు.. బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

ధనుష్ హీరోగా వచ్చిన విఐపి 2.. రఘువరన్ బి టెక్, సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై మొదట బజ్ ఉండేది. కానీ అర్జున్ రెడ్డి ముందు ఈ సినిమా నిలబడలేకపోయింది. అలాగే బాలకృష్ణ పైసా వసూల్, విశ్వక్సేన్ వెళ్ళిపోమాకే, అల్లరి నరేష్ మేడ‌ మీద అబ్బాయి, నాగచైతన్య యుద్దం శరణం, నారా రోహిత్ , నాగశౌర్యల కథలో రాజకుమారి, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన శ్రీవల్లి, సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు, ఇలా ఈ సినిమాలు అన్ని అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ మేనియాలో కొట్టుకుపోయాయి.