ఈ ఫోటోలో ముద్దుగా క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ!

పైన ఫోటోలు ముద్దుగు క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ. యంగ్ హీరోల‌కు వాంటెడ్ హీరోయిన్‌. రీసెంట్ గా ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. గెస్ చేశారా.. ఆమె ఎవ‌రో కాదండి నేహా శెట్టి. కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీల్లో టైటిల్‌ గెలిచుకుంది.

మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ఓ క‌న్న‌డ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. మెహబూబా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ‌త ఏడాది విడుద‌లైన డిజే టిల్లు చిత్రం.. నేహా శెట్టికి టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్ప‌డేలా చేసింది. ఇందులో రాధిక పాత్ర‌లో ఆమె అద‌ర‌గొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ `బెదురులంక 2012` చిత్రంతో వ‌చ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

కానీ, నేహా శెట్టికి మాత్రం న‌ట‌న ప‌రంగా మ‌రియు గ్లామ‌ర్ ప‌రంగా మంచి మార్కులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు మాస్ కా దాస్ విశ్వక్ దాస్ తో `గ్యాంగ్ ఆఫ్ గోదావరి`, కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో `రూల్స్ రంజ‌న్‌` చిత్రాలు చేస్తోంది. మ‌రోవైపు డీజే టిల్లుకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న టిల్లు స్క్వేర్ లో గెస్ట్ రోల్ ను ప్లే చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Neha Sshetty (@iamnehashetty)