జగన్ యాంటీ పోగొడుతున్న బాబు-పవన్.!

ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అత్యంత ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో జగన్ సి‌ఎం అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఊహించని మద్ధతు లభించింది. ఇక అదే ప్రజాదరణ ఇప్పటికీ ఉందా? అంటే కాస్త లేదనే చెప్పాలి. అలా అని రాష్ట్రంలో ఆధిక్యం ఆయనదే. కాకపోతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత రావడం, క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడటంతో వైసీపీ బలం కాస్త తగ్గింది..గాని ఓవరాల్ గా లీడ్ లోనే ఉన్నారు.

అయితే వైసీపీకి మొదట నుంచి మద్ధతుగా ఉండే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనారిటీల మద్ధతు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే..వైసీపీ అధికారంలోకి వస్తే ఈ వర్గాలకు బాగా మేలు జరుగుతుందని భావించారు. కానీ అనుకున్న మేర మేలు మాత్రం జరగలేదనే వాదనలు ఉన్నాయి. అదే సమయంలో జగన్ పరోక్షంగా బి‌జే‌పికి మద్ధతు తెలపడం మరో కారణమని అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ తప్పనిసరి పరిస్తితుల్లో కేంద్రంలోని బి‌జే‌పికి మద్దతు ఇస్తున్నారు.

కానీ ఈ అంశం దళిత, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలకు నచ్చడం లేదు. దీని వల్ల వారిలో కాస్త యాంటీ ఉంది.  అయితే ఆ వ్యతిరేకతని ఇప్పుడు చంద్రబాబు-పవన్ తప్పించేలా ఉన్నారు. ఎందుకంటే వారిద్దరు బి‌జే‌పితో పొత్తు దిశగా వెళుతున్నారు. కనీసం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం బి‌జే‌పికి మద్ధతు ఇస్తున్నారు. కానీ బాబు-పవన్ మాత్రం రాజకీయ ప్రయోజనాలు ఆశించి బి‌జే‌పితో స్నేహం కోరుతున్నారు.

రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిస్తే మళ్ళీ ఆ ఓటర్లు వన్‌సైడ్ గా వైసీపీకి మద్దతు ఇవ్వడం ఖాయం..మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం.