ప్రభాస్ తో అలా నటించడం నా ఆశ..స్టార్ హీరోయిన్ రాశి..!!

అందాల తార హీరోయిన్ రాశి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గతంలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె స్టార్ హీరోల సరసన నటించింది.. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహ బంధం లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీకి దూరమయింది రాశి.. వివాహం తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. దీంతో ఇమే బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న జానకి కలగలేదు అనే సీరియల్ లో నటిస్తున్న రాశి సీరియల్ కూడా ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది.. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేయడం జరిగింది.. ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరో గురించి మాట్లాడడం జరిగింది.. తనకు ఆల్ టైం ఫేవరెట్ హీరో ఎవరు అంటే శోభన్ బాబు అని తెలిపింది.. ఆ తర్వాత చిరంజీవి అని తెలుపగా ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో అయితే ప్రభాస్ అంటే చాలా ఇష్టమని తెలిపింది..

అంతేకాకుండా తను ఇప్పటివరకు నటించని హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ అని ఆయనతో నటించాలని చాలా ఆశగా ఉందంటూ తెలిపింది.. అయితే అది కూడా ఆయనతో హీరోయిన్గా చేయాలి తల్లిగా అంటే అసలు చేయాను ఇప్పటివరకు నేను ప్రభాస్ ని చూడలేదు.. మాట్లాడలేదు.. అడవి రాముడు సినిమా షూటింగ్ సమయం లో ఒక హోటల్లో మాత్రమే నేను ప్రభాస్ ఉన్నాము.. ఆ హోటల్లో ప్రభాస్ ఉన్నాడని తెలిసి చాలా ఆనందపడ్డాను ..వర్షం తర్వాత అడవి రాముడు తీస్తున్నారు.. ఈశ్వర్ సినిమా సమయంలోనే ట్రైలర్ చూసి ప్రభాస్ ని ఇష్టపడ్డానని ఆ తర్వాత ప్రభాస్ ని కలవాలని అరుస్తూ ఉంటే మా అన్నయ్య .. ప్రభాస్ ని కలవలేకపోయినా ఫోన్ లో మాట్లాడించడానికి తన రూమ్ లో ఉన్న మొబైల్ నుంచి ప్రభాస్ ఉన్న రూమ్ కి కాల్ చేసి మాట్లాడించేలా చేశారని తెలియజేశారు.. ప్రభాస్ తో మాట్లాడిన తర్వాత చివరిగా ప్రభాస్ థాంక్స్ అండి అని తెలిపారని తెలిపింది రాశి..