“దేవర” సినిమాలో జాన్వీ పేరు ఏంటో తెలుసా..? కొరటాల హిట్ కొట్టేసాడు పో..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు . దీంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని మళ్లీ ఎన్టీఆర్ పేరు డబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవాలని నందమూరి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ కోరిక ప్రకారమే దేవర లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అని రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆధారంగా తెలిసిపోతుంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నాడు సైఫ్ అలీ ఖాన్ అంటూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ బైరవ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా లో జాన్వీ కపూర్ పేరు “దేవిక” అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ బావ మరదలుగా కనిపించబోతున్నారట .

అంతేకాకుండా విలన్ తో వచ్చే ఫైట్ లో జాన్వీ కపూర్ చనిపోతుంది. ఆ తర్వాతే జాన్వి తన మరదలి కోసం వైల్డ్ గా మారి దేవర తాను అనుకున్న పనిని పూర్తి చేస్తాడు అంటూ స్టోరీ లైన్ కూడా లీక్ అయిపోయింది . అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ షెడ్ లో కనిపించబోతున్నారట . అంతేకాదు ఒకప్పటి ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఆది” సినిమాలో ఎలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ వాడారో.. సేమ్ దేవరకు కూడా అలాగే మాస్ మాసివ్ స్ట్రాంగ్ కౌంటర్ డైలాగ్స్ ఉండబోతున్నాయి అంటూ తెలుస్తుంది . దీంతో కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టేస్తున్నాడు అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!