అమలాపురంపై బాబు గురి..పవన్‌కు షాక్ ఇస్తారా?

కోనసీమ ప్రాంతంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు యావరేజ్ గా సాగిందని చెప్పవచ్చు. బాబు సభల్లో అనుకున్న మేర జనం కనిపించలేదు..కానీ పర్లేదు. మండపేట, కొత్తపేటలతో పోలిస్తే అమలాపురంలో జనం కాస్త బాగానే వచ్చారు. ఓవరాల్ గా కోనసీమలో బాబు టూర్ యావరేజ్ గా నడిచింది. అయితే బాబు పర్యటించిన మూడు నియోజకవర్గాల అంశంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ మూడు సీట్లలో జనసేనకు కాస్త బలం ఉంది. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు.

ఎలాగో మండపేట టి‌డి‌పి సిట్టింగ్ సీటు కాబట్టి అది వదిలేస్తే..కొత్తపేటలో జనసేన కంటే టి‌డి‌పికి డబుల్ బలం యూ‌ఎన్‌ఐ..కాబట్టి ఈ సీటు టి‌డి‌పి వదులుకునే ఛాన్స్ లేదు. ఇక అమలాపురం సీటు విషయానికొస్తే ఇక్కడ టి‌డి‌పి, జనసేన బలం దాదాపు సమానమే. గత ఎన్నికల్లో వైసీపీకి 72 వేల ఓట్లు పడితే..టి‌డి‌పికి 46 వేలు, జనసేనకు 45 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ గెలవడం కష్టం. కాకపోతే పొత్తు ఉంటే అమలాపురం సీటు ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు.

ఇటీవలే పవన్ అమలాపురం పర్యటిస్తే ప్రజా మద్ధతు భారీగానే వచ్చింది. తాజాగా చంద్రబాబు పర్యటనకు కూడా ప్రజా మద్ధతు పర్లేదు. ఇలా ఇద్దరు నేతలు అమలాపురంలో పర్యటించారు. దీంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఒకవేళ జనసేనకు సీటు దక్కితే..అక్కడున్న టి‌డి‌పి ఇంచార్జ్ ఎంతవరకు సహకరిస్తారో తెలియదు.

పోనీ టి‌డి‌పికి సీటు దక్కితే..జనసేన ఇంచార్జ్ సహకరిస్తారో లేదో తెలియదు. ఇలా పొత్తు ఉన్నా సరే నేతల మధ్య సఖ్యత లేకపోతే మళ్ళీ ఈ సీటు వైసీపీ గెలుచుకోవడం ఖాయం.