వెరీ వెరీ డేంజ‌ర్‌లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం… బీ కేర్‌ఫుల్‌…!

ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. ఒత్తిడితో కూడిన పనిత‌నం, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేసిన 183 మంది ఐటి ఉద్యోగులపై అధ్యయనం చెయ్యగా ఆ వివరాలు అంతర్జాతియ పీర్ రివ్యూడ్ జర్నల్ “న్యూట్రియెంట్స్” ఆగస్టు 2023 మ్యాగజైన్ ప్రచురితమయ్యాయి. మంచి ఆరోగ్యపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను పెంచేందుకు ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సురక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్ఐఎన్ సమస్త పేరుకుంది.

సగటున 8 గంటలకంటే ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారని వెల్లడించింది. 78 శాతం మంది వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని, కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారంలో నిర్దేశించిన 150 నిమిషాల పాటు శారీరిక శ్రమ చేస్తున్నారని పేర్కొంది. 26 నుంచి 35 ఏళ్లు లోపు వయసు వారు కూడా ఉబకాయం, రక్తపోటు, మధుమేహం బారిన పడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొంది.

తరచూ బయట ఆహారం తినడం, రోజువారి ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండడం, భోజనం సమయానికి తినకపోవడం వల్ల ఐటి ఉద్యోగులను అనారోగ్యానికి గురి చేసినట్లు ఎన్ఐఎన్ డైరెక్టర్ డా‌. హేమలత తెలిపారు. 30 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసున్న సీనియర్ ఉద్యోగుల్లో ఒత్తిడి అధికంగా ఉందని… వారిలో జీవనశైలిలో ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ అధ్యయనంలో తులిపారు. ప్రాజెక్టుకు ప్రధాన పరిశోధకులుగా జీనియస్ శాస్త్రవేత్త డా. సుబ్బారావు ఎంగవరపు తెలిపారు.