ట్రోలింగ్ పై స్నేక్ బ్యాచ్ అంటూ టార్గెట్ చేస్తున్న మంచు విష్ణు.. ఆ హీరోకేనా..?

సినీ రంగానికి చెందిన కొంతమంది కొందరిని టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రొల్స్ చేస్తూ ఉంటారు.. అయితే ఇవి కొంతవరకు బాగానే ఉన్న మితిమీరి పోతే చాలా బాధకు గురిచేస్తాయి.. ఈ ట్రోల్స్ వల్ల సినీ రంగంలో చాలామంది ప్రముఖుల సైతం ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు.. మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు కుటుంబం పైన కొంతమంది పని కట్టుకొని మరి ట్రోల్ చేయడం జరిగింది. దీంతో వీరి అభిమానులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేశారు..అయినప్పటికీ ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ విషయంపైన మంచి విష్ణు కలుగజేసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి ఫిర్యాదు ఇచ్చారు.

MAA president Manchu Vishnu's overenthusiastic tweet goes viral

తమపై ట్రోలింగ్ చేస్తున్నది చేయిస్తున్నది ఎవరో కూడా ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని అదొక స్నేక్ బ్యాచ్ చేస్తున్న పని అంటూ విష్ణు కౌంటర్ వేయడం జరిగింది.. కానీ అలాంటి ట్రోలింగ్లను పెద్దగా పట్టించుకోనని ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ ట్రోల్స్ నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.. అయితే ఈ ట్రోల్స్ మితిమీరి పోతే సహించేది లేదంటూ కూడా తెలిపారు మంచు విష్ణు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లు కూడా బాగానే ఉంటాయి. వాటిని చూసి చాలా సార్లు ఎంజాయ్ చేశామని తెలిపారు.

కొంతమంది పని కట్టుకొని డబ్బులు ఇచ్చి మరి ట్రొల్స్ చేస్తున్నారు.. అది మాత్రం చాలా తప్పని తెలిపారు విష్ణు మా ఎలక్షన్ ముందు వరకు మాపై ట్రోలింగ్ ఉండేది కాదు..ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రారంభమయ్యాయో అప్పటినుంచి ట్రోల్ చేస్తున్నారు.. ఈ ట్రోల్ చేయిస్తున్నది ఎవరో కాదు స్నేక్ బ్యాచ్ దీని వెనక ఎవరున్నారన్నది తెలుపలేదు కానీ.. పలువురు నెటిజెన్లు మాత్రం స్నేక్ బ్యాచ్ అంటే నాగబాబుని వస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. గతంలో నాగబాబు మా ఎలక్షన్లో సమయంలో నానా హంగామా చేశారు. దీన్నిబట్టి చూస్తే మంచు విష్ణు డైరెక్టుగా పేరు చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా పేరు చెప్పారని తెలుస్తోంది.