హీరో యష్ జీవితంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయా..?

పాన్ ఇండియా సినీ ప్రేక్షకులకు సైతం కన్నడ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. యశ్ కంటే రాఖీ బాయ్ పాత్రలో మంచి పాపులారిటీ సంపాదించారు కేజిఎఫ్ -1,2 సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న యష్ పలు రకాల రికార్డులను సైతం క్రియేట్ చేశారు. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే హీరోగా తనను తాను నిరూపించుకోవడం కోసం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది యష్.

KGF 2 star Yash, Radhika Pandit, Ayra and Yatharv are a happy family in new  housewarming pics - India Today

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న యశ్.. అసలు పేరు నవీన్.. కర్ణాటకలోని హాసన్ అనే గ్రామంలో ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.. ఈయన తల్లి తన కుమారుడు పేరు యశ్వంత్ గా మార్చినట్లు తెలుస్తోంది.. ఇండస్ట్రీలోకి వచ్చాక యేసుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది స్కూలుకు వెళ్లే రోజుల నుంచి నటన పైన ఆసక్తి ఉండడంతో 16 ఏళ్ల వయసులోనే ఒక ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఉండడానికి బెంగళూరుకి వెళ్లారట.అప్పుడు కేవలం తన చేతిలో రూ .300 రూపాయలే ఉన్నట్లు తెలుస్తోంది.

Yash (KGF) Age, Height, Wife, Family, Children, Biography & More »  StarsUnfolded

అలా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశాలు సంపాదించకపోవడంతో థియేటర్ ట్రూపులో బ్యాక్ డాన్సర్ గా పని చేశారట. అప్పుడు రోజుకి 50 రూపాయలు మాత్రమే వచ్చేదట. 2018లో 18 సంవత్సరాల వయసులో ఒక నాటకంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది అలా 2005 లో తన భార్య రాధిక పండిట్ తో కలిసి నందగోకుల అనే సీరియల్ లో నటించారు. ఆ తర్వాత ఏడాది రాకి చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ వెంటనే పలు చిత్రాలలో నటించిన కంటపడడంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కేజిఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు సంచలనాలను అందుకుంది.