రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్న తలైవా.. బాక్సాఫీస్ వద్ద జైలర్ ఊచకోత..!!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికీ ఈ వయసులో కూడా పలు సినిమాలలో నటిస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు రజనీకాంత్.. తమిళనాడు నెంబర్ గేమ్ మొదలయ్యిందని చెప్పవచ్చు. రేసులో ముందున్న విజయ్ తో ప్రస్తుతం పోటీగా రజనీకాంత్ పడుతున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో షేర్ చేస్తున్నారు. మొదటి రోజు నుంచి జైలర్ సినిమా పాజిటివ్ టాక్ తో దుమ్ము దులిపేస్తోంది.

Jailer' Review: Rajinikanth returns to supreme form in Nelson Dilipkumar's  film - India Today

తెలుగు తమిళ్ కన్నడ మలయాళం తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే పదం వినిపిస్తోంది దీంతో రజిని అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు. జైలర్ సినిమా సక్సెస్ తో విజయ్ కు టెస్టింగ్ టైం మొదలైంది అంటూ పలువురు నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోలీవుడ్లో అన్ అఫీషియల్ గా ప్రస్తుతం హీరో విజయ్ దళపతి మాత్రమే నెంబర్వన్ స్థానంలో ఉన్నారు.. గడిచిన అయిదారేళ్ల నుంచి విజయ్ సినిమాలు ఈజీగా రూ .300 కోట్ల రూపాయలు క్రాస్ చేస్తున్నాయి.

Jailer OTT Release When And Where To Watch Rajinikanth Mohanlal-Starrer  Film Online

నెగిటివ్ టాప్ తో వచ్చిన దాదాపుగా రూ .200 కోట్లకు పైగా కలెక్షన్లు చేయడంతో పాటు రజనీకాంత్ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడంతో తన స్టామినా చూపిస్తూ ఉన్నారు.. రజిని సినిమా సక్సెస్ అయితే ఎలా ఉంటుందో జైలర్ సినిమా చూపించింది. రెండు రోజుల్లోనే రూ.150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ఇక రజనీకాంత్ ఫామ్ లోకి రావాడడంతో లియో తో జైలర్ను మించి హిట్టు కొట్టాలి విజయ్ లేకపోతే రజనీకాంత్ ని క్రాస్ చేయడం కష్టమే అని రజనీకాంత్ అభిమానులు తెలుపుతున్నారు.. ప్రస్తుతం కోలీవుడ్లో నెంబర్ వన్ హీరో రజనీకాంత్ అంటూ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికి రూ .220 కోట్లకు పైగా వచ్చినట్టు సమాచారం.