త్వరలో పెళ్లి పీటలుఎకబోతున్న విశ్వక్ సేన్.. వధువు ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సెన్ ఫలక్నామా దాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో నటించిన విశ్వక్ చివరిగా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. తాజాగా తమ అభిమానులకు ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది విశ్వక్ సెన్.. త్వరలోనే తాను ఒక ఇంటివాడిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాల్ ఒక నోట్ ని షేర్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్టు 15వ తేదీన తెలియజేస్తాను అంటూ విశ్వక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. నేటిజన్స్ ఈ పోస్ట్ పైన పలు రకాల క్రేజీ కామెంట్లు చేస్తూ ఉన్నారు.. కొంతమంది నివేద పేతురాజుతో వివాహం కాబోతోంది అంటూ కామెంట్స్ చేయగా.. మరి కొంత మంది విశ్వక్ తన చిన్ననాటి స్నేహితురాలని వివాహం చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్ని రోజులుగా తనపైన ప్రేమ చూపిస్తున్న అభిమానులకు శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారా త్వరలోనే నా జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నాను నేను కుటుంబాన్ని మొదలు పెట్టబోతున్నాను అంటూ విశ్వక్ తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు ఆగస్టు 15 న వెల్లడిస్తాను అంటూ ఈ నోటు ద్వారా తెలియజేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)