త్వరలోనే మెగా ఫ్యామిలీ నుండి మరో గుడ్ న్యూస్.. క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన కొత్త పెళ్లి కొడుకు..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “గాండీవధారి అర్జున”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ స్పై యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కింది . టీజర్, ట్రైలర్ ఎంతలా అభిమానులను ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆగస్టు 25న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వరుణ్ తేజ్ .

రీసెంట్ గానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకున్నాడు . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో ఆయన పెళ్లికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎదురవుతున్నాయి . రీసెంట్గా వరుణ్ తేజ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ నుంచి బిగ్ మల్టీ స్టార్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ..? అనే ప్రశ్న ఎదురయింది. హోస్ట్ ప్రశ్నిస్తూ..” ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కాంబోలో బ్రో అనే మల్టీ స్టార్లర్ వచ్చింది. అలాగే త్వరలోనే ఏదైనా మరో బిగ్ మల్టీస్టారర్ మెగా హీరోల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా..?” అంటూ క్వశ్చన్ చేశారు.

 

అయితే దీనికి ఆన్సర్ గా ఎస్ అంటూ వరుణ్ తేజ్ స్పందించారు. ” మా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారత్ లు చేయడానికి మేము రెడీ . ఒకరు ఇద్దరు కాదు నలుగురు ఐదుగురు ఐదుగురు హీరోలము కూడా మేము మల్టీ స్టార్ర్ సినిమాలు చేస్తాం. అయితే దానికి తగ్గ కథను కంటెంట్ ను రెడీ చేసుకుని డైరెక్టర్ లు మేకర్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే కచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం ” అంటూ చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . ఆ తర్వాత కరెక్ట్ గా ఎవరైనా డైరెక్టర్ మల్టీ స్టారర్ సినిమాను తీసుకెళ్తే మెగా హీరోలు చేయడానికి కూడా సిద్ధం . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా గుడ్ న్యూస్ లు వినబోతున్నారు మెగా ఫాన్స్ అంటూ క్రేజీ హింట్ ఇచ్చేసాడు వరుణ్ తేజ్..!!