ఎన్టీఆర్ సొంత గడ్డ..వైసీపీ అడ్డా..మళ్ళీ టీడీపీ అస్సామే.!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు..దివంగత ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నిమ్మకూరు ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది. అంతకముందు పామర్రు మండలం గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. దీంతో అక్కడ ఎన్టీఆర్ పోటీ చేసి సత్తా చాటారు. తర్వాత టి‌డి‌పి హవా కొనసాగుతూ వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుడివాడ అలాగే ఉంది..పామర్రు సెపరేట్ నియోజకవర్గంగా ఏర్పడింది.

అయితే ఇలా ఎన్టీఆర్ సొంత గడ్డగా ఉన్న పామర్రులో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో వైసీపీ నుంచి ఉప్పులేటి కల్పన గెలిచారు. ఆమె గతంలో టి‌డి‌పిలో పనిచేశారు. దీంతో పాత పరిచయాలని ఉపయోగించుకుని టి‌డి‌పిలోకి వచ్చారు. కానీ ఆమెపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా సరే 2019లో సీటు ఇచ్చారు. అందుకే ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.  వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. కృష్ణా జిల్లాలో ఇదే అత్యధిక మెజారిటీ.

ఇలా సొంత గడ్డ వైసీపీ అడ్డాగా మారిపోయింది. అయితే జిల్లాలో టి‌డి‌పి నిదానంగా బలపడుతుంది. కొన్ని సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ పామర్రులో ఇంకా వెనుకబడే ఉంది. ఇక్కడ వైసీపీకే లీడ్ ఉంది. వైసీపీ ఎమ్మెల్యేకు పెద్ద పాజిటివ్ లేదు. కానీ ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉండటం, కమ్మ వర్గం..టి‌డి‌పి ఇంచార్జ్ వర్ల కుమార్ రాజాకు పెద్దగా సహకరించకపోవడం వైసీపీకి ప్లస్ అవుతుంది.

అందుకే మళ్ళీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని సర్వేలు చెబుతున్నాయి. అంటే మరొకసారి ఎన్టీఆర్ గడ్డపై టి‌డి‌పి ఓటమి ఖాయమే అంటున్నారు.