అలియా భ‌ట్‌కూ త‌ప్ప‌ని బాడీ షేమింగ్‌.. వాటి సైజు పెంచుకోమ‌ని చెత్త స‌ల‌హాలు ఇచ్చారా?

బాడీ షేమింగ్‌.. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బాగా వినిపించే మాట‌. ముఖ్యంగా హీరోయిన్లలో ఎవ‌రో ఒక‌రు తాము బాడీ షేమింగ్ కు గుర‌య్యామ‌ని నోరు విప్పుతూనే ఉంటారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భ‌ట్‌కూ బాడీ షేమింగ్ త‌ప్ప‌లేద‌ట‌. తాజాగా ఈ విష‌యాన్ని ఆమె బ‌య‌ట‌పెడుతూ.. కెరీర్ ఆరంభంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకుంది.

ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తెగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అలియా భ‌ట్.. త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన టాలెంట్‌తో స్టార్డ‌మ్ ను సంపాదించుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. న‌టిగా ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకుంది. అయితే స్టార్ కిడా అయినా కూడా అలియా భ‌ట్ కు కెరీర్ ఆరంభంలో కొన్ని చేదు అనుభ‌వాల‌ను ఎదుర్కొంద‌ట‌.

ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కు వచ్చిన కొత్త‌లో కొంద‌రు త‌న‌పై చాలా వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేశార‌ని.. చూడ‌టానికి హాట్ గా లేవు.. బ్రెస్ట్ సైజులు చిన్నగా ఉన్నాయి.. వాటిని పెంచుకో.. వీలైతే సర్జరీ చేసుకో అని కొంద‌రు ముఖంపై చెత్త స‌ల‌హాలు వ‌చ్చార‌ని అలియా భ‌ట్ బ‌య‌ట‌పెట్టింది. అయితే వాటిని ప‌ట్టించుకుని ఏడూస్తూ కూర్చుంటే ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌లేము.. అందుకే ఎవ‌రెన్ని చెత్త స‌ల‌హాలు ఇచ్చినా తాను ప‌ట్టించుకోలేద‌ని అలియా భ‌ట్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.