ఆ ముగ్గురు వల్లే హీరో సుమన్ జైలుకెల్లారా..!!

తెలుగు ప్రేక్షకులకు అలనాటి నటుడు సుమన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు దక్షిణాదిలోని అన్ని భాషలలో నటించి మెప్పించిన ఈ నటుడు హీరోగా ఒక వెలుగు వెలిగారు.. ముఖ్యంగా కరాటే మార్షల్ ఆర్ట్స్ లో తన టాలెంట్ తో ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించారు దాదాపుగా ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి 700 పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి వంటి అగ్ర హీరోలతో పోటీపడిన సుమన్ నీలి చిత్రాల కేసుల అరెస్టు కావడంతో జైలు జీవితాన్ని కూడా గడిపారు.

Suman (Actor) Height, Weight, Age, Wife, Biography & More » StarsUnfolded

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీగా ఇవ్వలేదు .. నీలి చిత్రాల వ్యవహారం వల్ల సుమన్ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా సుమన్ ను పక్కా ప్లాన్ తోనే ఇలాంటి వాటిలో ఇరికించారని ఆరోపణలు ఇప్పటికీ ఇండస్ట్రీలో నే వినిపిస్తుంటాయి. ఈ విషయంపై చిరంజీవి పైన కొన్ని సార్లు ప్రచార వార్తలు వినిపించాయి.. అయితే ఈ విషయంపై సుమన్ కూడా ఎన్నోసార్లు అలాంటిదేమీ లేదని కూడా తెలియజేశారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Veteran Telugu Film director Sagar (70) passes away! | Telugu Movie News -  Times of India

డైరెక్టర్ సాగర్ 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు.. సుమన్ నీలి చిత్రాల వ్యవహారం పై మాట్లాడుతూ ఈ విషయంలో సుమన్ జైలుకు వెళ్లలేదని డైరెక్టర్ సాగర్ తెలిపారు.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి MGR , అప్పట్లో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్ కాంట్రాక్టర్.. ఇలా వీరి ముగ్గురు వల్లే సుమన్ జైలుకు వెళ్లారని తెలిపారు. లిక్కర్ కాంట్రాక్టర్ కూతురిని సుమన్ ఫ్రెండ్ ఒకరు ప్రేమించారట.. మరొకవైపు హీరో సుమన్ అంటే డీజీపీ కూతురికి చాలా ఇష్టం ఉండేదట అతని శూన్య షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేదని తెలియజేశారు సాగర్. కానీ సుమన్ మాత్రం ఆమెను ఎప్పుడూ ఇష్టపడలేదు.. అయితే డిజిపి తన కూతురికి అప్పటికి వివాహం అయ్యిందని దీంతో సుమన్ ట్రాప్ లో పడే ఆలోచనలో ఉండడంతో పక్కా ప్లాన్ తోనే సుమన్ ను ఇబ్బంది పెట్టారని సాగర్ తెలిపారు.