పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మామాఅల్లుళ్లు భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్నారు.
మొదటి రోజే రూ. 30 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన ఈ చిత్రం వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి సగానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది. మూడు రోజు సండే కావడంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 10.48 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో మొత్తం రూ. 55.26 కోట్ల షేర్, రూ. 91.75 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.
ఈ సినిమా రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే.. ఇంకా రూ. 43.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ ను రీచై బ్రో క్లీన్ హిట్ అవుతుందా..లేదా.. అన్నది చూడాలి. కాగా, ఏరియాల వారీగా బ్రో మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
నైజాం: 17.45 కోట్లు
సీడెడ్: 5.56 కోట్లు
ఉత్తరాంద్ర: 5.74 కోట్లు
తూర్పు: 3.93 కోట్లు
పశ్చిమ: 3.74 కోట్లు
గుంటూరు: 4.00 కోట్లు
కృష్ణ: 2.75 కోట్లు
నెల్లూరు: 1.39 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ= 44.56 కోట్లు(52.50 కోట్లు~ గ్రాస్)
—————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 4.85 కోట్లు
ఓవర్సీస్: 5.85 కోట్లు
———————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 55.26 కోట్లు(91.75 కోట్లు~ గ్రాస్)
———————————————-