బాబు జిల్లాలో జగన్ హవా..మళ్ళీ వైసీపీకే ఆధిక్యం.!

వైసీపీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఇది టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే. పేరుకే బాబు సొంత జిల్లా గాని…ఇక్కడ పూర్తి పట్టు వైసీపీకే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 వైసీపీ…ఒక కుప్పంలో మాత్రమే టి‌డి‌పి గెలిచిది.

అయితే ఈ సారి ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. ఏ మాత్రం టి‌డి‌పికి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుతుంది. కానీ అన్నీ సీట్లు వైసీపీ గెలవడం కష్టమే గాని…ఆధిక్యం మాత్రం వైసీపీకే వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ కనిపించడం లేదు. ఇటీవల వస్తున్న సర్వేలని బట్టి చూస్తే..వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా వన్ సైడ్ గా గెలవడం అనేది కష్టమే.

ప్రస్తుతం పరిస్తితులని చూస్తే వైసీపీ గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు..పుంగనూరు, చంద్రగిరి, తంబళ్ళపల్లె, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు సీట్లు…టి‌డి‌పికి గెలిచే అవకాశం ఉన్న సీట్లు..నగరి, కుప్పం, పీలేరు, పలమనేరు…ఇక మదనపల్లె, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి సీట్లలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంది.

అయితే ఈ నాలుగు సీట్లలో స్వల్ప ఆధిక్యం వైసీపీకే ఉంది. కాకపోతే చిత్తూరు, తిరుపతిల్లో జనసేనకు కాస్త బలం ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఆ సీట్లలో పై చేయి సాధించవచ్చు. ఏదేమైనా చిత్తూరులో వైసీపీకే ఆధిక్యం రానుంది.