పవన్‌ ఎంట్రీతో షేక్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఉద‌యం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. `ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్‌` అనే నినాదంతో పవన్ క‌ళ్యాణ్ అకౌంట్ క్రియేటైంది. తన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ నే ఇన్‌స్టాకు కూడా పెట్టుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయిపోతోంది.

ఆయ‌న అలా అడుగు పెట్టారో లేదు.. ఫాలోవ‌ర్స్ కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చిప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంత వ‌ర‌కు ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌లేదు. కానీ, ఫాలోవ‌ర్స్ మాత్రం భారీ సంఖ్య‌లో వ‌చ్చి చేరుతున్నారు. అభిమానులే కాకుండా ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు.

దీంతో ఒక్క రోజులోనే 1.7 మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అఫీషియ‌ల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేరారు. అంటే 17 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ అన్న మాట‌. ఒక్క రోజులోనే ఇంత మంది ఫాలోవ‌ర్స్ అంటే ఒక రికార్డే అని చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. `ఇది కదా పవర్‌ స్టార్‌ క్రేజ్‌. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు` అంటూ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరోను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ టీం ఆయ‌న ఇన్‌స్టా అకౌంట్ ని హ్యాండిల్‌ చేస్తుంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫ‌స్ట్ పోస్ట్ ఏం పెడ‌తారు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.