కృష్ణాలో వైసీపీ జోరు..జనసేనతోనే టీడీపీకి ప్లస్.!

కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా..దీంతో రాజకీయంగా అక్కడ టి‌డి‌పి హవా ఉండేది. రాష్ట్రంలో గాలి ఎలా ఉన్న..కృష్ణాలో టి‌డి‌పి జోరు ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి ఆ జోరు తగ్గిపోయింది. వైసీపీ హవా పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధిచింది. ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీకే లీడ్ వచ్చేలా ఉంది. కాకపోతే జనసేన కలిస్తే టి‌డి‌పికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెడన, పెనమలూరు, గుడివాడ, గన్నవరం సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం మినహా మిగిలిన సెట్లు వైసీపీనే గెలుచుకుంది. తర్వాత గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లారు. దీంతో ఆ సీటు కూడా వైసీపీ వశమైంది. ఇక ఇప్పుడు పరిస్తితి చూసుకుంటే కృష్ణాలో వైసీపీకే లీడ్ కనిపిస్తుంది.

గుడివాడ, గన్నవరం, పామర్రు సీట్లు వైసీపీ డౌట్ లేకుండా గెలుచుకోనుంది. ఇక టి‌డి‌పి ఒక్క పెనమలూరులోనే గెలిచే ఛాన్స్ ఉంది. మిగిలిన మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుంది. కాకపోతే జనసేనతో ట్విస్ట్ ఉంది. జనసేనకు…మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ సీట్లలో…ఒక్కో చోట 25 వేల ఓట్ల వరకు ఉన్నాయి. ఈ ఓట్లే గెలుపోటములని డిసైడ్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది.

కానీ ఇప్పుడు టి‌డి‌పితో పొత్తు ఖాయమవుతుంది. అదే జరిగితే మూడు సీట్లలో టి‌డి‌పి-జనసేన గెలిచే ఛాన్స్ ఉంది. అలాగే మచిలీపట్నం ఎంపీ సీటుని సైతం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే కృష్ణాలో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటేనే ప్లస్ అవుతుంది.