అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో

యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. నిఖిల్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది కార్తికేయ 2 సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. కార్తికేయ 2 అయిపోగానే నిఖిల్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ స్పై. స్పై సినిమా తాజాగా విడుదలైంది. మొదటి రోజే అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినా ఆ తరువాత అదే జోరు కొనసాగించలేకపోయింది అనే చెప్పలు. టాక్ ఎలా ఉన్న మొదటి రోజే ఏకంగా రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఒక లాంగ్ నోట్ ను రిలీజ్ చేస్తూ క్షమాపణలు చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

నిఖిల్ మాట్లాడుతూ ఇక తను చేసే సినిమాలు అన్ని భాషల్లో విడుదలవుతాయని చెప్పారు. నా కెరియర్ లో అత్యధిక ఓపెనింగ్స్ ను బాక్సాఫీస్ వద్ద అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఇక నాపై మీరు పెట్టుకున్న ఇంత నమ్మకం చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని నిఖిల్ చెప్పారు. స్పై సినిమా అన్ని భాషల్లో విడుదల చేయలేకపోవడం భాదను కలిగించింది అన్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి.

ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఇలా డిజాస్టర్ కావడంతో హిందీ, కన్నడ, తమిళ్ , మలయాళం ప్రేక్షకులందరికీ నిఖిల్ క్షమాపణలు చెప్పారు. రాబోయే సినిమాలు కచ్చితంగా అన్ని భాషల్లో విడుదల చేస్తామంటూ నిఖిల్ మాటిచ్చారు. మొత్తానికి సినిమా అంచనాలని అందుకోలేకపోవడంతో నిఖిల్ ఇలా క్షమాపణలు చెప్పిన లాంగ్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.