కారు-కాంగ్రెస్ మధ్యే పోరు…కమలం సింగిల్ డిజిట్‌తోనే.!

ఈ సారి కూడా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోరు నడవనుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో అదే మాదిరిగా పోరు జరిగింది. కాకపోతే  కారుకు..కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బి‌ఆర్‌ఎస్ పార్టీ వన్‌సైడ్‌గా గెలిచింది. కానీ ఈ సారి ఎన్నికలు అలా ఉండవని కారుకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని తేలింది.

అయితే మొన్నటివరకు రేసులో కనిపించిన బి‌జే‌పి మాత్రం..ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. అసలు ఆ మధ్య బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్యే పోరు జరుగుతున్నట్లు కనిపించింది. కానీ ఎంత జరిగిన బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో బలం లేని విషయం తెలిసిందే. బలమైన నాయకులు ఆ పార్టీలో తక్కువగా ఉన్నారు. ఇదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, తెలంగాణలో ఆ పార్టీకి ఊపు వచ్చింది. ఇక వలసలు కూడా కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చింది.

ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే దిశలో కాంగ్రెస్ నడుస్తుంది. అయితే లేటెస్ట్ సర్వేలని బట్టి చూసుకుంటే ఇంకా ఆధిక్యంలో బి‌ఆర్‌ఎస్ ఉందని తేలింది. ఇక కాంగ్రెస్ రెండోస్థానంలో ఉండగా,  మూడో స్థానంలో బి‌జే‌పి ఉంది. అయితే కాంగ్రెస్ ఇంకాస్త కష్టపడితే బి‌ఆర్‌ఎస్ పార్టీని నిలువరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే బి‌ఆర్‌ఎస్ లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మైనస్ ఉంది. వారిని సైడ్ చేస్తేనే బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్లస్.

ఇక బి‌జే‌పి మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని తేలింది. ఆ పార్టీలో కీలక నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డి‌కే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ లాంటి వారికే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బలమైన అభ్యర్ధులతోనే బి‌జే‌పికి గెలుపు..అందుకే ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం.